Virat Kohli: తిరుగులేని రన్ మెషీన్... విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

  • అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు
  • 2563 పరుగులతో నెంబర్ వన్ గా కోహ్లీ
  • తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ

వెస్టిండీస్ తో తిరువనంతపురంలో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ రికార్డు నమోదుచేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 19 పరుగులు మాత్రమే చేసినా మొత్తం 2563 పరుగులతో నెంబర్ వన్ గా నిలిచాడు. కోహ్లీ తర్వాత స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అంతర్జాతీ టీ20 క్రికెట్ లో రోహిత్ 2562 పరుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో న్యూజిలాండ్ కు చెందిన మార్టిన్ గప్టిల్ (2436), పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ (2263) ఉన్నారు.

Virat Kohli
Rohit Sharma
T20
Most Runs
Cricket
  • Loading...

More Telugu News