janasena: పవన్ కల్యాణ్ పెళ్లిళ్లలపై అడిగిన ప్రశ్నకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఒకరి వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా?
  • ఆ విషయాలను బహిరంగంగా ప్రస్తావించేవారికి  సిగ్గు అనిపించదా?
  • పవన్ లాంటి వ్యక్తి  రాజకీయాలకు కావాలి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రశంసలు కురిపించారు. ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వందో, రెండొందల కోట్లో కావాలని అన్నారు.

‘ఐ లైక్ పవన్ కల్యాణ్.. ఐ సపోర్ట్ పవన్ కల్యాణ్. ఎందుకంటే, పీక్ లో ఉన్నటువంటి కెరీర్ ని వదిలి.. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్లోకి వెళ్లి పాటిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడి రాజకీయంలోకి కావాలి’ అని అభిప్రాయపడ్డారు. రాజకీయం సామాన్యుడికి అందుబాటులోకి రావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని, ఆయన ముందుకెళుతున్న విధానం తనకు నచ్చిందని, ఆయనకు తన నైతిక మద్దతు అని అన్నారు.

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తీ తన వ్యక్తిగత జీవితంలో వచ్చే ‘స్ట్రగుల్స్’ వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడని, ఆ విషయాలను బహిరంగంగా ప్రస్తావించేవారికి  సిగ్గు అనిపించదా అని ప్రశ్నించారు.

janasena
Pawan Kalyan
MAA
President
Naresh
  • Loading...

More Telugu News