Arun shouri: పూణేలోని ఆసుపత్రిలో అరుణ్ శౌరీని పరామర్శించిన మోదీ

  • ఇటీవలే గాయపడ్డ అరుణ్ శౌరీ  
  • రూబీ హాల్ లో ఆసుపత్రిలో చికిత్స
  • అరుణ్ శౌరీ ఆరోగ్యం గురించి మోదీ ఆరా

కేంద్ర మాజీ మంత్రి, జర్నలిస్టు అరుణ్ శౌరీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. పూణేలోని రూబీ హాల్ లో చికిత్స పొందుతున్న ఆయన వద్దకు మోదీ ఈరోజు వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ విషయాన్ని మోదీ ఓ పోస్ట్ లో తెలిపారు.

తమ మధ్య చక్కని చర్చ జరిగిందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యం పొందాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని తన పోస్ట్ లో ఆకాంక్షించారు. కాగా, గత ఆదివారం రాత్రి లావాసాలోని తన నివాసంలో నడుస్తున్న అరుణ్ శౌరీ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో ఆయన తలకు గాయమైంది. పూణెలోని రూబీ హాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ శౌరీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.

Arun shouri
Pune
Hospital
Narendra Modi
Pm
  • Loading...

More Telugu News