Tiruvananthapuram: తిరువనంతపురం టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్

  • రెండో టీ20 మ్యాచ్ లో బౌలింగ్ ఎంచుకున్న కరీబియన్ టీమ్
  • తొలి మ్యాచ్ లో భారత్ గెలుపు
  • ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు సన్నద్ధం

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ కు తిరువనంతపురం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్ లో 200కి పైగా స్కోరును భారత బ్యాట్స్ మెన్ ఉఫ్ మని ఊదేయడం చూసిన విండీస్, ఈసారి ఆ అవకాశం ఇవ్వకూడదని తానే ఛేజింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. టీమిండియాలో ఆసక్తికర మార్పులేమీ లేవు. తొలి మ్యాచ్ ఆడిన జట్టే ఇక్కడా బరిలో దిగుతోంది. లోకల్ బాయ్ సంజూ శాంసన్ కు అవకాశమిస్తారని ప్రచారం జరిగినా, జట్టు కూర్పులో మార్పులు చేసేందుకు టీమ్ మేనేజ్ మెంట్ పెద్దగా ఆసక్తిచూపలేదు.

Tiruvananthapuram
Kerala
India
West Indies
Cricket
Toss
  • Loading...

More Telugu News