plastic: మనిషి శరీరంలోకి విష రసాయనాలు.. ప్లాస్టిక్ ప్రభావంపై మరో విషయాన్ని తేల్చిన పరిశోధకులు!

  • ప్లాస్టిక్ చేస్తోన్న కీడుపై మరో విషయాన్ని గుర్తించిన పరిశోధకులు 
  • మన శరీరంలోకి  బీపీఏ అనే రసాయనం 
  • మూత్ర నమూనాలపై పరీక్షలు జరిపి గుర్తించిన పరిశోధకులు

మనిషి జీవితంలో ప్లాస్టిక్ ను ఎంతగా వినియోగిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మట్టిలో కరగదు.. మనిషిని వీడదు ఈ ప్లాస్టిక్. పర్యావరణానికి ముప్పులా పరిణమించిన ప్లాస్టిక్.. మనిషికి కూడా ఎన్నో జబ్బులు తెచ్చిపెడుతోంది. నీళ్లు తాగడం నుంచి, ఇంటికి పార్సిల్స్ పట్టుకెళ్లే వరకు అన్నింటికీ ప్లాస్టిక్ ను వాడుతున్నాం. మనిషికి ప్లాస్టిక్ చేస్తోన్న కీడుపై పరిశోధకులు మరో విషయాన్ని గుర్తించారు. ప్లాస్టిక్‌ ద్వారా మనకు తెలియకుండానే బీపీఏ అనే రసాయనం మన శరీరంలోకి వెళ్తోందని అమెరికా పరిశోధకులు తేల్చారు.
 
కొంత మంది మూత్ర నమూనాలపై పరీక్షలు జరిపిన పరిశోధకులు... ప్లాస్టిక్ ను అధికంగా వినియోగించిన వారిలో సాధారణం కంటే 44 రెట్లు ఎక్కువ బీపీఏ ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంతానోత్పత్తి, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News