Vijayawada: విజయవాడ భవాని సంఘటనలో మరో మలుపు.. ఆ అమ్మాయి తనకే కావాలంటోన్న పెంపుడు తల్లి

  • 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన భవాని
  • ఫేస్ బుక్ ద్వారా ఈ రోజు కన్నవారిని కలిసిన భవాని
  • పెంచిన తల్లి, కన్న తల్లిదండ్రుల్లో ఎవరి వద్ద ఉండనుందన్న సందిగ్ధత

15 ఏళ్ల క్రితం తప్పిపోయిన భవాని అనే బాలిక గురించి ఫేస్ బుక్ ద్వారా కన్నవారికి ఆమె గురించిన వివరాలు తెలిసిన విషయం విదితమే. మూడేళ్ల వయసులో తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి నుంచి తప్పిపోయిన భవాని విజయవాడలోని జయమ్మ అనే మహిళ వద్ద పెరిగింది. విజయవాడలో వంశీ అనే వ్యక్తి ఇంట్లో పనిమనిషిగా జయమ్మ పని చేస్తోంది. ఆయన ఫేస్ బుక్ లో ఆ బాలిక వివరాలు పోస్ట్ చేయగా భవాని తన సొంత తల్లిదండ్రులను ఈ రోజు కలుసుకుంది.

భవాని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా మెళియాపుటి మండలం చీపురుపల్లి. అయితే, భవాని విషయంలో మరో మలుపు చోటు చేసుకుంది. భవాని తనకే కావాలని పెంపుడు తల్లి జయమ్మ కోరుతోంది. మాధవరావు, వరలక్ష్మి మాత్రం ఆమెను ఇచ్చేందుకు ఒప్పుకోవట్లేదని తెలిసింది. దీంతో ఆమె పెంచిన తల్లి, కన్న తల్లిదండ్రుల్లో ఎవరి వద్ద ఉండనుందన్న సందిగ్ధత నెలకొంది.

Vijayawada
Hyderabad
  • Loading...

More Telugu News