Tiktok: టిక్ టాక్ లో ఇండో, పాక్ లెస్బియన్ యువతుల డ్యాన్స్ తొలగింపు... ట్విట్టర్ లో ప్రత్యక్షమై వైరల్!

  • ఏం తప్పు చేశామని వీడియో తొలగించారు?
  • టిక్ టాక్ పై అంజలి మండిపాటు
  • లెస్బియన్లు కావడమే తప్పంటున్న నెటిజన్లు

ఇండియా, పాకిస్థాన్ కు చెందిన లెస్బియన్ యువతులు అంజలి చక్రా, సుందాస్ మాలిక్ లు చేసిన డ్యాన్స్ ను, టిక్ టాక్ తొలగించింది. వీరిద్దరూ నృత్యం చేస్తూ, నవ్వుతూ, ముద్దులు పెట్టుకుంటూ వేసిన స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి. ఓ పారదర్శక గొడుగు కింద వీరు వేసిన స్టెప్పులపై విమర్శలు కూడా వచ్చాయి.

తమ వీడియోను ఎందుకు తొలగించారని అంజలి, సుందాస్ లు టిక్ టాక్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ వీడియోను తొలగించాల్సినంత తప్పు ఏం చేశామని ప్రశ్నించారు. వీరు లెస్బియన్లు కావడంతోనే వీడియోను తొలగించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్న పరిస్థితి. టిక్ టాక్ లో వీడియోను తొలగించిన తరువాత, ట్విట్టర్ లో ఈ వీడియోను అంజలి పోస్ట్ చేయడం గమనార్హం.

Tiktok
Viral Videos
India
Pakista
Ladies
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News