Uttar Pradesh: ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో విధ్వంసానికి పాల్పడ్డ రోగి బంధువులు.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- హృద్రోగ సమస్యలతో బాధపడుతోన్న ఓ రోగి
- ఆసుపత్రికి తీసుకొచ్చిన బంధువులు
- హృద్రోగ్య వైద్యులు లేరనడంతో విధ్వంసం
ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో కొందరు విధ్వంసానికి పాల్పడ్డ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హృద్రోగ సమస్యలతో బాధపడుతోన్న ఓ రోగిని అతడి బంధువులు రామ్ పూర్ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు.
అయితే, హృద్రోగ్య వైద్యులు అందుబాటులో లేరని, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది వారికి సూచించారు. దీంతో ఆ రోగి బంధువులు రెచ్చిపోయారు. అత్యవసర చికిత్సా విభాగంలోని ఓ గదిలో ఉన్న టేబుల్, కుర్చీలు వంటి అన్ని వస్తువులను పగులగొట్టి విధ్వంసం సృష్టించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. విధ్వంసానికి పాల్పడ్డ వారిలో మహిళలు కూడా ఉన్నారు.