Prakasam District: వైసీపీకి ముద్దన తిరుపతినాయుడు రాజీనామా!

  • డీసీఎంఎస్ పదవిని ఆశించిన ముద్దన
  • రామనాథంకు ఇవ్వడంతో అలక
  • బాలినేనికి రాజీనామా లేఖ సమర్పణ

ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ముద్దన తిరుపతి నాయుడు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఆశించిన ముద్దన, ఆ పదవిని రామనాథంకు ఇవ్వడంతో అలకబూని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పార్టీలో తనకు సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కడం లేదని గత కొంతకాలంగా తన అనుచరుల ముందు వ్యాఖ్యానిస్తున్న ఆయన, ఇప్పుడు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించిన ముద్దన, తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.

Prakasam District
YSRCP
Muddana
Tirupati nayudu
Resign
  • Loading...

More Telugu News