Ruler: 'ఇది దెబ్బతిన్న సింహంరా... వెంటాడి, వేటాడి చంపుద్ది' అంటూ గర్జిస్తున్న బాలయ్య... 'రూలర్' ట్రైలర్ వచ్చేసింది!

  • ఈ ఉదయం విడుదల అయిన ట్రైలర్
  • బాలయ్య 105వ చిత్రంగా 'రూలర్'
  • ఫ్యాన్స్ ను అలరించేలా డైలాగ్స్

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడా, ఎప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ 105వ చిత్రం 'రూలర్' ట్రైలర్ ఈ ఉదయం విడుదలైంది. ఈ ట్రైలర్ లో బాలకృష్ణ న్యూలుక్ తో మాన్లీగా కనిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్, ఓ సాంగ్ విడుదల కాగా, వాటికి నెటిజన్లు, ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. "ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?" అన్న బాలయ్య డైలాగ్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తుందంటే అతిశయోక్తి కాదు.

"ఇది దెబ్బతిన్న సింహంరా... అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది" అన్న డైలాగ్ కూడా ట్రైలర్ లో వినిపిస్తుంది. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా, భూమిక, ప్రకాశ్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రం 20వ తేదీన విడుదల కానుంది. 'రూలర్' ట్రైలర్ ను మీరూ చూడవచ్చు.

Ruler
Trailer
Balakrishna
  • Error fetching data: Network response was not ok

More Telugu News