mysore king: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మైసూరు యువరాజు స్పందన

  • పోలీసుల చర్యలను వ్యతిరేకించడం సరికాదు
  • చట్టప్రకారం ఎన్‌కౌంటర్ జరిగి ఉంటే తప్పులేదు
  • రాజుల కాలానికీ, నేటికీ తేడా ఉంది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న వేళ మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ స్పందించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌పై పోలీసు చర్యలను వ్యతిరేకించడం సరైనది కాదన్నారు.

హత్యాచారం వంటి ఘటనలు ఎవరికీ సంతోషం కాదన్న ఆయన హైదరాబాద్ పోలీసుల తీరును సమర్థించారు. హైదరాబాద్ పోలీసులు అక్కడి పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించారన్నారు. ఎన్‌కౌంటర్ చట్ట ప్రకారం జరిగితే తప్పులేదని ఒడయార్ స్పష్టం చేశారు. నాటి రాజుల కాలానికి, నేటి ప్రజాస్వామ్యానికి చాలా వ్యత్యాసం ఉందని కృష్ణదత్త పేర్కొన్నారు.

mysore king
Hyderabad encounter
Disha
  • Loading...

More Telugu News