మీడియాపై విరుచుకుపడ్డ పూనం కౌర్.. ఆ ట్వీట్లు తనవి కావని వివరణ
- ట్విట్టర్ వేదికగా విరణ ఇచ్చిన పూనం
- #soldmedia, #presstitutes అంటూ పరుష పదజాలం
- పొలిటీషియన్స్ ను కూడా వదలని వైనం
అలాగే మీడియాపై తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను వైరల్ చేస్తూ సైకోల్లా ప్రవర్తిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇప్పటికే తనకు, తన కుటుంబానికి జరగాల్సిన అన్యాయం ఎలాగూ జరిగిపోయిందని, అయినా వీరి రాతలు ఆగడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతటితో ఆగకుండా #soldmedia (సోల్డ్ మీడియా), presstitutes (ప్రెస్టిట్యూట్స్) అంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. ఈ తరహా వైఖరి కలిగిన ప్రెస్టిట్యూట్స్, పొలిటీషియన్స్ కంటే ఒళ్లు అమ్ముకునే వేశ్యలే నయమని, తమ వారి కోసం కూడా ఏమీ చేయలేని వీరు నాయకులు ఎలా అవుతారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.