Anam Ramanarayana Reddy: ఆనం వ్యాఖ్యలపై మండిపడుతున్న సీఎం జగన్... అవసరమైతే సస్పెండ్ చేయాలంటూ హుకుం!

  • నెల్లూరును మాఫియాకు అప్పగించారన్న ఆనం
  • మండిపడుతున్న వైసీపీ అధినాయకత్వం
  • వ్యక్తిగత ఆధిపత్యం సహించబోనన్న సీఎం జగన్!

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చిక్కుల్లో పడ్డారు. సొంతపార్టీపైనే వ్యాఖ్యలు చేసిన ఫలితంగా ఆయనపై పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నెల్లూరు అన్ని రకాల మాఫియాలకు అడ్డాగా మారిందని, ఇసుక, లిక్కర్, బెట్టింగ్ మాఫియాలకు నెల్లూరును అప్పగించారంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ హైకమాండ్ కు రుచించడంలేదు. ఇప్పటికే విజయసాయిరెడ్డి పరోక్ష హెచ్చరికలు జారీ చేయగా, సీఎం జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

షోకాజ్ నోటీసులు పంపడమే కాకుండా, అవసరమైతే సస్పెండ్ చేయాలని హుకుం జారీ చేసినట్టు సమాచారం. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తే వేటు తప్పదని సీఎం జగన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఆనం బెట్టింగ్ అంటూ చేసిన వ్యాఖ్యలు మంత్రి అనిల్ కుమార్ ను ఉద్దేశించి అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అనిల్ కుమార్ పై గతంలో బెట్టింగ్ ఆరోపణలు రావడం తెలిసిందే.

Anam Ramanarayana Reddy
YSRCP
Jagan
Nellore District
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News