fake currency seized: కడపలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

  • కడప జిల్లాలోని ఓ లాడ్జిలో పట్టుబడ్డ నిందితులు
  • నిందితుల్లో ఇద్దరు కామెరూన్ దేశస్థులు
  • రూ.7.28లక్షల దొంగనోట్లు, గంజాయి, ప్రింటర్.. స్వాధీనం

కడప జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరించారు. పట్టణంలోని సిద్ధ ప్రియ లాడ్జిలో దొంగనోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో లాడ్జిపై దాడిచేసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితుల్లో ఇద్దరు కామెరూన్ దేశానికి, మరో ఇద్దరు విశాఖ, ఒకరు కడపకు చెందినవారిగా గుర్తించామన్నారు. వారి నుంచి రూ.7.28లక్షల దొంగనోట్లు, గంజాయి, ప్రింటర్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

fake currency seized
Kadapa District
A lodge sidda Priya
  • Loading...

More Telugu News