YCP MP Party general secretary Vijaya Sai reddy: పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించం: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • ఎంతటివారినైనా సహించేది లేదు
  • సమస్యలుంటే సీఎం జగన్ దృష్టికి తీసుకురావాలి
  • మీడియా ముందుకు తీసుకువస్తే చర్యలు తప్పవు

వైసీపీలో క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తున్నామని, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విధేయత మరిచి క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే.. ఎంతటివారైనా సహించేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

 ఏమైనా సమస్యలుంటే వాటిని పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలా చేయకుండా నేరుగా మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు.

YCP MP Party general secretary Vijaya Sai reddy
comments on Party decipline
  • Loading...

More Telugu News