Guntur District: తాడేపల్లిలో నకిలీ పోలీసుల హల్ చల్.. ఇద్దరి అరెస్ట్

  • పోలీసులమంటూ దుకాణాలకు 
  • మామూళ్ల కోసం ఒత్తిడి 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

పోలీసులమంటూ దుకాణాలపై పడి మామూళ్లకు ఒత్తిడి చేస్తున్న ఇద్దరు నకిలీలను గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు... తేలికగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇద్దరు యువకులు పోలీసుల అవతారం ఎత్తారు. తాడేపల్లిలోని షాపులను తమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నారు. షాపుల వద్దకు వెళ్లి మామూళ్లు వసూలు చేయడం మొదలు పెట్టారు.

తొలిరోజుల్లో ఎంతోకొంత సమర్పించుకున్న దుకాణ యజమానులు రోజు రోజుకీ వీరి ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మతిరిగి పోయింది. వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరూ అసలు పోలీసులే కాదని తెలియడంతో కంగుతిన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

Guntur District
tadepalli
two arrest
duplicate police
  • Loading...

More Telugu News