Pawan Kalyan: మతమార్పిడులపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా వున్నాయి.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: జనసేన క్రైస్తవ నేత

  • పవన్ వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి
  • మత విద్వేషాలు చెలరేగేలా ఉన్నాయి
  • ఆ వ్యాఖ్యలను పనవ్ వెనక్కి తీసుకుంటారని భావించాం
  • ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు  

ఇటీవల విజయవాడలో సామూహిక మత మార్పిడులు చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోని క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత, ఏపీ క్రైస్తవుల సంఘం నాయకుడు అలివర్ రాయ్ ఈ విషయంపై స్పందించి, పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆయన వ్యాఖ్యలు తమను తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేశాయని అలివర్ రాయ్ తెలిపారు. పున్నమి ఘాట్‌లో మత మార్పిడిలు జరిగాయని పవన్ కల్యాణ్ అన్నారని, ఆయన వ్యాఖ్యల వల్ల మత విద్వేషాలు చెలరేగేలా ఉన్నాయని విమర్శించారు. తన వ్యాఖ్యలను పవన్ వెంటనే వెనక్కి తీసుకుంటారని తాము భావించామని, అయితే, ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని వివరించారు. దీంతో  పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని, త్వరలో పోలీసు కమిషనర్‌ను కలుస్తామని చెప్పారు.

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
  • Loading...

More Telugu News