Disha: దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ప్రదేశంలో బుల్లెట్ల కోసం మెటల్ డిటెక్టర్లతో శోధన

  • నిన్న దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • ఎన్ కౌంటర్ స్థలంలో క్లూస్ టీమ్ పరిశీలన
  • కాసేపట్లో మానవ హక్కుల కమిషన్ పర్యటన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనకు పోలీసు మార్కు పరిష్కారం లభించడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కేసు రీ కన్ స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడ ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దిశ నిందితులు నలుగురు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని క్లూస్ టీమ్ సందర్శించింది.

కాల్పులు జరిగిన ప్రదేశంలో బుల్లెట్ల కోసం పరిశీలిస్తున్నారు. అందుకోసం మెటల్ డిటెక్టర్లను ఉపయోగిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో 12 రౌండ్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరికాసేపట్లో మానవ హక్కుల కమిషన్ సభ్యులు ఎన్ కౌంటర్ స్థలానికి వెళ్లనున్నారు.

Disha
Encounter
Telangana
Hyderabad
NHRC
  • Loading...

More Telugu News