Telangana: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ నివాసంలో చోరీకి యత్నించిన పొరుగింటి వ్యక్తి!

  • మోండా మార్కెట్ ఏరియాలో నివాసం ఉంటున్న టి.పద్మారావు  
  • గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించేందుకు దొంగల యత్నం
  • అప్రమత్తమైన కుటుంబ సభ్యులు

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు నివాసంలో దొంగతనానికి ప్రయత్నించిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు పద్మారావు పొరుగింటి వ్యక్తి కావడం గమనార్హం. పద్మారావు మోండా మార్కెట్ ఏరియాలోని తకార బస్తీలో నివసిస్తుంటారు. అయితే తెల్లవారుజామున ఇంటి గ్రిల్స్ ను తొలగిస్తూ ఐదుగురు వ్యక్తులు పద్మారావు కుటుంబసభ్యుల కంట్లో పడ్డారు. పద్మారావు భార్య, కుమారుడు రామేశ్వర్ గౌడ్ దొంగలను చూసి ఇతర కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. వారు సిబ్బందికి ఈ విషయం తెలియజేయడంతో దొంగలను పట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Telangana
Hyderabad
T.Padmarao
TRS
Police
  • Loading...

More Telugu News