Pawan Kalyan: రేప్ చేస్తే బెత్తం దెబ్బలు కొడితే చాలని చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి: పవన్ పై విజయసాయి రెడ్డి విమర్శలు

  • తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నాడు.
  • పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడుతున్నాడు
  • ఈ వ్యక్తి నీతులు చెబుతుండటం దురదృష్టం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రేప్ చేస్తే ఉరి తీస్తారా? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని ‘తీర్పు’ చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి. తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నాడు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబుతుండటం దురదృష్టం' అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, గతంలో అనంతపురం జిల్లా గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పవన్ మాట్లాడుతూ... విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. తన అక్క రోడ్డు మీద వెళుతుంటే కొందరు ఏడిపించారని, అప్పుడు తనకు వాళ్లను కత్తితో పొడిచి చంపేద్దామన్నంత కోపం వచ్చిందని ఆయన చెప్పారు.

Pawan Kalyan
Jana Sena
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News