India: రోహిత్ శర్మ విఫలమైనా టీమిండియాను రేసులో నిలిపిన రాహుల్, కోహ్లీ

  • ఉప్పల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు
  • ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన భారత్

వెస్టిండీస్ తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా లక్ష్యం దిశగా సాగుతోంది. 208 పరుగుల లక్ష్యఛేదనలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సిసలైన టీ20 బ్యాటింగ్ తో స్కోరుబోర్డును ఉరకలెత్తిస్తున్నారు.

రాహుల్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కోహ్లీ 34 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు. 62  పరుగులు సాధించిన రాహుల్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా విజయానికి ఇంకా 36 బంతుల్లో 69 పరుగులు చేయాలి. క్రీజులో కోహ్లీ, పంత్ ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది.

India
West Indies
Uppal
Hyderabad
Cricket
T20
  • Loading...

More Telugu News