Triamp Motor cycles: భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

  • ఆకర్షణీయంగా రూపొందించిన 2020 మోడల్
  • గత మోడల్ కంటే 40 కేజీలు బరువు తగ్గిన లేటెస్ట్ బైక్
  • ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర రూ.18 లక్షలు  

చూడగానే ఆకట్టుకునే సరికొత్త మోడల్ బైక్ ను ట్రయాంప్ మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 2020 మోడల్ రకంగా, రాకెట్ 3 బైక్ ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. అధునాతనమైన ఫీచర్లను కలిగివున్న ఈ బైక్ గత బైక్ కంటే 40 కేజీలు తేలికగా ఉంటుంది. మూడు సిలిండర్లున్న ఈ బైక్ లో 2,500 సీసీ ఇంజిన్, 6000 ఆర్ పీఎం వద్ద 165 బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. 4000 ఆర్ పీఎం వద్ద అత్యధికంగా 221 ఎన్ ఎం టార్క్ ను విడుదల చేస్తుంది.

గుండ్రంగా ఉండే హెడ్ లైట్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ దీని ప్రత్యేకత. అల్యూమినియం ఫ్రేమ్ ను ఉపయోగించారు. రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్ తదితర ఫీచర్లున్న ఈ బైక్ ధర రూ.18 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం) గా నిర్ణయించారు. ఈ బైక్ కు సంబంధించి,  ప్రపంచ వ్యాప్తంగా ఆర్, జీటీ అనే రెండు వేరియంట్లుండగా... భారత్ లో ఆర్ వేరియంట్ ను విడుదల చేశారు.

Triamp Motor cycles
New model 2020 bike R 3 released in Indian Market
  • Loading...

More Telugu News