Arabia sea: సోమాలియా దిశగా ప్రయాణిస్తున్న ‘పవన్’ తుపాన్
- నైరుతి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడ్డ తుపాన్
- శ్రీలంక ప్రతిపాదన దృష్ట్యా దీనికి ‘పవన్’ అని పేరు
- భారత్ కు అంత ప్రమాదం ఉండకపోవచ్చు: వాతావరణ శాఖాధికారులు
నైరుతి అరేబియా సముద్రం మీదుగా నిన్న ఏర్పడ్డ తుపాన్ దక్షిణాఫ్రికాలోని సోమాలియా దిశగా ప్రయాణిస్తోంది. శ్రీలంక దేశం ప్రతిపాదన మేరకు ఈ తుపాన్ కు ‘పవన్’ అని నామకరణం చేశారు. రేపటి లోపు ఇది బలహీనపడుతుందని, ఈ తుపాన్ వల్ల భారత్ కు అంత ప్రమాదం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. నైరుతి అరేబియాలోని ఆఫ్రికా తీరంలో ‘పవన్’ తుపాన్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, కర్ణాటక తీరానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది.