Disha: ఎన్ కౌంటర్లకు నేను వ్యతిరేకం: అసదుద్దీన్ ఒవైసీ

  • దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
  • వ్యక్తిగతంగా ఎన్ కౌంటర్లను ఇష్టపడనని చెప్పిన ఒవైసీ
  • విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయంటూ వ్యాఖ్యలు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తాను ఎన్ కౌంటర్లకు వ్యతిరేకమని తన వైఖరిని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి ఎన్ కౌంటర్లను వ్యక్తిగతంగా తాను ఇష్టపడనని తెలిపారు. ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించిందని, సైబరాబాద్ పోలీసులు ఎందుకు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేశారో ఈ విచారణలో తేలుతుందని అన్నారు.

Disha
Encounter
Police
Telangana
Asaduddin Owaisi
MIM
  • Loading...

More Telugu News