Andhra Pradesh: వ్యక్తిగత సహాయకుడు నారాయణ కుటుంబసభ్యులకు సీఎం జగన్ పరామర్శ

  • అనంతపురంలోని దిగువపల్లికి వెళ్లిన జగన్ దంపతులు
  • నారాయణ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి
  • నారాయణ కుటుంబానికి అండగా వుంటానని భరోసా

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. వార్త తెలిసిన వెంటనే ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అర్ధాంతరంగా తన టూర్ ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లాలోని దిగువపల్లికి ఈరోజు మధ్యాహ్నం జగన్, ఆయన భార్య భారతి వెళ్లారు. నారాయణ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. నారాయణ కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చిన జగన్, వారి కుటుంబానికి అండగా వుంటానని భరోసా ఇచ్చారు. కాగా, నారాయణతో జగన్ కుటుంబానికి మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. నాడు జగన్ చేపట్టిన పాదయాత్రలో కూడా నారాయణ పాల్గొన్నారు.

Andhra Pradesh
cm
jagan
personal assistan
Narayana
Anatapuram
Diguvapalli
  • Loading...

More Telugu News