Disha: ఎన్ కౌంటర్ లో గాయపడిన ఎస్సై, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉంది: కేర్ ఆసుపత్రి వైద్యులు

  • తెల్లవారుజామునే దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • ఇద్దరు పోలీసులకు గాయాలు
  • కేర్ ఆసుపత్రికి తరలింపు

ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలో దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం తెలిసిందే. సీన్ రీ-కన్ స్ట్రక్షన్ నిమిత్తం నిందితులను ఘటన స్థలానికి తీసుకెళ్లిన పోలీసులకు వారి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు రాళ్లతో దాడికి దిగారు.

ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితులు నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ కూడా గాయపడ్డారు. గాయపడిన పోలీసులను హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నారని వివరించారు.

Disha
Police
Telangana
Hyderabad
Care
  • Loading...

More Telugu News