Disha: దిశ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు రూ.లక్ష చొప్పున నజరానా.. ప్రకటించిన రాహ్ ఫౌండేషన్

  • దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
  • అభినందనల వెల్లువలో తడిసి ముద్దవుతున్న తెలంగాణ పోలీసులు
  • నగదు రివార్డు ప్రకటించిన రాహ్ గ్రూప్

దిశ నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల చాలా వరకు అభినందనపూర్వకమైన స్పందనలే వస్తున్నాయి. తాజాగా, హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు నజరానా ప్రకటించింది. ఒక్కో పోలీసుకు రూ.లక్ష చొప్పున కానుకగా అందించాలని నిర్ణయించినట్టు రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ వెల్లడించారు. తెలంగాణ పోలీసులపై అందరూ ప్రశంసలు మాత్రమే కురిపిస్తుండగా, రాహ్ గ్రూప్ కాసుల వర్షం కురిపించాలని తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Disha
Telangana
Hyderabad
Police
Encounter
Rah Group
Haryana
  • Loading...

More Telugu News