Vinay Sharma: వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చండి... రాష్ట్రపతిని కోరిన నిర్భయ తల్లిదండ్రులు
![](https://imgd.ap7am.com/thumbnail/tn-2a876085eee0.jpg)
- సంచలనం సృష్టించిన నిర్భయ కేసు
- రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్న నిందితుడు వినయ్ శర్మ
- తిరస్కరించాలని కేంద్రం కూడా సిఫారసు
ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు ఇప్పటికీ మరణ శిక్ష అమలు కాలేదు. నిర్భయ కేసులో నిందితుడు వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి అర్జీ సమర్పించాడు. దీనిపై నిర్భయ తల్లిదండ్రులు స్పందించారు. మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు అర్జీ పెట్టుకున్నాడని, వినయ్ శర్మ అభ్యర్థనను తోసిపుచ్చాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కు లేఖ రాశారు. ఇప్పటికే వినయ్ శర్మ అభ్యర్థనను తిరస్కరించాలని కేంద్రం కూడా రాష్ట్రపతికి సిఫారసు చేసింది.