comments by union minister Menaka Gandhi NWC Chairperson Rekha Sharma: ‘దిశ’ నిందితులకు చట్ట పరంగా శిక్ష పడితే బాగుండేది: కేంద్రమంత్రి మేనకా గాంధీ
- చట్టాన్ని ఎవరూ కూడా చేతుల్లోకి తీసుకోకూడదన్న మంత్రి
- మరణ దండన కోరుకున్నామన్న ఎన్ డబ్ల్యుసీ ఛైర్ పర్సన్ రేఖా శర్మ
- ఎన్ కౌంటర్ రూపంలో శిక్ష విధించడం ఆశ్చర్యానికి గురిచేసింది
దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టడం సబబేనంటూ సర్వత్రా అభిప్రాయాలు వస్తోన్నప్పటికీ.. మరోపక్క కొందరు నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు చట్టపరంగా శిక్షపడితే బాగుండేదని వారు అంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ..‘ చట్టాన్ని ఎవరూ కూడా తమ చేతుల్లోకి తీసుకోకూడదు. నేరం రుజువైన తర్వాత నిందితులకు తప్పకుండా ఉరిశిక్ష పడేది’ అని అన్నారు.
జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ కూడా ఇదేవిధంగా అభిప్రాయపడ్డారు. ‘నిందితులకు మరణ దండనను కోరుకున్నాం. అది న్యాయపరంగా జరిగితే సబబుగా ఉండేది. ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందో తెలియదు. అది పోలీసులు మాత్రమే చెప్పగలరు’ అని రేఖా శర్మ వ్యాఖ్యానించారు.