Nirbhaya: నిర్భయ కేసు డీల్ చేస్తున్నప్పుడు మాకు ఈ ఆలోచన రాలేదు: ఢిల్లీ మాజీ సీపీ నీరజ్ కుమార్

  • ఏడేళ్ల కిందట నిర్భయ ఘటన
  • కేసు డీల్ చేసిన నీరజ్ కుమార్
  • చట్ట ప్రకారమే ముందుకెళ్లామని వెల్లడి

ఏడేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. నిర్భయ నిందితులకు మరణశిక్ష పడినా ఇప్పటికీ అమలు కాలేదు. అయితే, తెలంగాణలో జరిగిన దిశ ఘటనలో కొన్నిరోజులకే నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై అన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నాడు నిర్భయ కేసును దర్యాప్తు చేసిన ఢిల్లీ మాజీ సీపీ నీరజ్ కుమార్ తాజాగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు.

తాము నిర్భయ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో విపరీతమైన ఒత్తిళ్లు వచ్చాయని, అయితే తమకు ఎన్ కౌంటర్ ఆలోచన రాలేదని వెల్లడించారు. నిందితులను తమకు హ్యాండోవర్ చేయాలంటూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, కానీ చట్టం ద్వారానే నిందితులను శిక్షించాలన్న ఆలోచనతో తాము ఆ సందేశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించారు.

Nirbhaya
New Delhi
Police
Neeraj Kumar
Disha
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News