disha: 'ఎన్‌కౌంటర్' చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ: కార్తీ చిదంబరం తీవ్ర అభ్యంతరాలు
- అత్యాచారం అనేది హేయమైన చర్యే
- చట్టానికి లోబడే చర్యలు తీసుకోవాలి
- ఎన్ కౌంటర్ చేయడం సరికాదు
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం స్పందించారు. తన తండ్రిలాగే ఆయన కూడా ఎన్ కౌంటర్ పై అభ్యంతరాలు తెలిపారు.
అత్యాచారం అనేది హేయమైన చర్యేనని, అయితే, చట్టానికి లోబడే చర్యలు తీసుకోవాలని కార్తీ చిదంబరం చెప్పుకొచ్చారు. ఎన్‌కౌంటర్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆయన అన్నారు. బాధితులకు తక్షణం న్యాయం జరగాలన్న డిమాండ్ ను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. అయితే, ఎన్ కౌంటర్ చేయడం సరికాదని చెప్పుకొచ్చారు.