Hyderabad: విచారణ జరపాల్సిందే: హైదరాబాద్ 'ఎన్ కౌంటర్' పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

  • ఈ ఘటనలో నిజానిజాలు ఏమిటో నాకు తెలియదు 
  • ఎన్ కౌంటర్ పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి
  • నిందితులు నిజంగానే పారిపోయేందుకు ప్రయత్నించారా?

వెటర్నరీ వైద్యురాలు దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... 'హైదరాబాద్ లో జరిగిన పరిణామాల్లో నిజానిజాలు ఏమిటో నాకు తెలియదు. అయితే, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నేనో విషయం చెప్పదలుచుకున్నాను. ఎన్ కౌంటర్ పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. నిందితులు నిజంగానే పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే ఎన్ కౌంటర్ చేశారా? అన్న విషయాన్ని తేల్చాలి' అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

Hyderabad
Disha
Crime News
chidambaram
  • Loading...

More Telugu News