jusice for disa: శవ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు

  • ఘటనా స్థలిలోనే శవపంచనామా
  •  స్థానిక ఆర్డీవో, క్లూటీం, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పూర్తి 
  •  శవ పరీక్షల కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలింపు

ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలకు పరీక్షలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. స్థానిక ఆర్డీవో, క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఘటనా స్థలిలోనే కాసేపటిక్రితం పంచనామా పూర్తి చేయించారు. 

అనంతరం మృతదేహాలను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించి శవ పరీక్షలు పూర్తి చేయించాలని నిర్ణయించారు. ఎన్ కౌంటర్ సమాచారం తెలియడంతో భారీ సంఖ్యలో చుట్టుపక్కల జనం ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గోల చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో వాహనాల్లో మృతదేహాలను ఆసుపత్రికి తరలించాలనుకుంటే భద్రతాపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి పోలీసులు తొలుత ఘటనా స్థలిలోనే శవ పరీక్షలు నిర్వహించాలని భావించారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత మనసు మార్చుకుని పంచనామా మాత్రమే అక్కడ పూర్తిచేసి ఆసుపత్రిలోనే శవపరీక్షలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.

jusice for disa
Hyderabad
encounter
postmartam
  • Loading...

More Telugu News