Disha: వారి డెడ్ బాడీలను ఒక్కసారి చూడాలని ఉంది: దిశ తల్లి కోరిక

  • మీడియాతో మాట్లాడిన దిశ తల్లి
  • పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు
  • తన బిడ్డకు మనశ్శాంతి కలుగుతుందని వెల్లడి

ఈ తెల్లవారుజామున ఎన్ కౌంటర్ లో హతులైన నలుగురి మృతదేహాలనూ చూడాలని అనిపిస్తోందని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆమె, షాద్‌నగర్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తనకు తెలిసిందని అన్నారు.

దిశ మరణించిన 10 రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. నిందితుల మరణం తమకు మనశ్శాంతిని కలిగించిందని అన్నారు. ఇంత తొందరగా తమకు న్యాయం జరుగుతుందని భావించలేదని, వారి డెడ్ బాడీలను తనకు చూపించాలని కోరారు. తన బిడ్డ లేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని, నిందితుల మరణంతో ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

Disha
Encounter
Dead Bodies
  • Loading...

More Telugu News