Rahul Gandhi: రాహుల్ ప్రసంగాన్ని అద్భుతంగా అనువదించిన కేరళ బాలిక... వీడియో ఇదిగో!

  • వాయనాడ్ లో రాహుల్ పర్యటన
  • ఇంగ్లీషులో మాట్లాడిన రాహుల్
  • రాహుల్ ను ఆకట్టుకున్న కేరళ అమ్మాయి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన నియోజకవర్గంలో పర్యటించేందుకు వాయనాడ్ వచ్చిన రాహుల్ అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యాసంస్థ ల్యాబ్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. అయితే రాహుల్ కు మలయాళం రాకపోవడంతో ఇంగ్లీషులోనే ప్రసంగించారు. సమయానికి పార్టీ తరఫున అనువాదకుడు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆ విద్యాసంస్థకు చెందిన సఫా షిబిన్ అనే ఇంటర్ విద్యార్థిని ధైర్యంగా ముందుకు వచ్చింది. రాహుల్ ఆమె స్థైర్యాన్ని చూసి ప్రోత్సహించారు.

సఫా అక్కడున్న అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ రాహుల్ ప్రసంగాన్ని పొల్లు పోకుండా అనువదించి ఔరా అనిపించింది. ఆమె అనువాదం చేసిన ప్రతిసారి చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. చివరికి రాహుల్ సైతం సఫా ప్రతిభకు ముగ్ధుడయ్యారు. ఆమెకు ఓ కానుక కూడా ఇచ్చి సంతోషపెట్టారు. రాహుల్ అంతటివాడ్ని అచ్చెరువొందించిన ఆ ఇంటర్ విద్యార్థినిని విద్యాసంస్థ యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Rahul Gandhi
Wayanad
Kerala
Safa
Congress
Lok Sabha
  • Error fetching data: Network response was not ok

More Telugu News