Karanam Balaram: బెదిరిస్తే పార్టీ మారడానికి మాకు రాళ్లు, ఇసుక వ్యాపారాలు లేవు: కరణం బలరాం

  • ప్రకాశం జిల్లాలో కీలకనేతగా గుర్తింపు తెచ్చుకున్న కరణం బలరాం
  • టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటూ ప్రచారం
  • స్పందించిన కరణం

ప్రకాశం జిల్లా రాజకీయాలపై తమదైన ముద్రవేసిన టీడీపీ నాయకుడు కరణం బలరాం. దశాబ్దాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన ఇప్పటికీ టీడీపీలో కీలకనేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఇటీవల కొందరు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరణం బలరాం స్పందించారు. పార్టీ మారాల్సినంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అయినా ఎవరో బెదిరిస్తే పార్టీ మారడానికి తనకేమీ రాళ్లు, ఇసుక వ్యాపారాలు లేవని తెలిపారు. ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని ఉద్ఘాటించారు.

Karanam Balaram
Telugudesam
Prakasam District
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News