Chandrababu: చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ నటన: మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా

  • ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదే
  • అభివృద్ధి అంటే ఏంటో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు
  • జగన్ ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు చేశారు. ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. 35వ డివిజన్ చర్చి వద్ద నుంచి తన పర్యటన ప్రారంభించిన ఆయన స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న అడ్డరోడ్డు, మసీదు ఎదురురోడ్డు నిర్మాణం, కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, మెట్లకు మరమ్మతు పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబిలో నెట్టిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుకే దక్కుతుందని, గత ఐదేళ్లలో బాబు చేయలేని పనులను సీఎం జగన్ ఆరు నెలల్లో చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు.

Chandrababu
Pawan Kalyan
Jagan
Vellampalli
  • Loading...

More Telugu News