Telugudesam: ముగిసిన టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం... పలు నిర్ణయాలకు ఏకగ్రీవ ఆమోదం
![](https://imgd.ap7am.com/thumbnail/tn-c0140d82e447.jpg)
- విజయవాడలో సమావేశం
- అమరావతి ప్రధాన అజెండాగా చర్చ
- సమావేశానికి హాజరుకాని బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం
రాజధాని అమరావతి అంశం ప్రధాన అజెండాగా టీడీపీ విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. రాజధానిపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని తీర్మానించారు.
టీడీపీ ఆధ్వర్వంలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ కు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం దూరంగా ఉన్నాయి. టీడీపీ మొత్తం 17 పార్టీలను ఆహ్వానించగా, సీపీఐ నుంచి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి బొలిశెట్టి సత్యనారాయణ హాజరయ్యారు. రాజధాని ప్రాంత రైతులు కూడా ఈ సమావేశానికి తరలివచ్చారు.