Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు యువకుల దుర్మరణం

  • నెత్తురోడిన రహదారి
  • ఆగివున్న డీసీఎంను ఢీకొట్టిన కారు
  • అక్కడికక్కడే మృతి చెందిన యువకులు

అతివేగం అనర్థదాయకం అని ఎంత మొత్తుకుంటున్నా వినని పర్యవసానంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా నందిగామ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు యువకులు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులు నందిగామకు చెందిన అరవింద్, దుర్గ, అనిల్, సాయిమనోజ్ లుగా గుర్తించారు. అధిక వేగంతో ప్రయాణిస్తూ, సెల్ ఫోన్ మాట్లాడడం  ప్రమాదానికి దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. హైవేపై ఆగివున్న డీసీఎంను యువకులు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొంది. కారు పూర్తిగా ధ్వంసమైంది.

Krishna District
Road Accident
Andhra Pradesh
Police
  • Loading...

More Telugu News