Buggana: రాజధానిపై చంద్రబాబు మోసాలతో 'శఠగోపం' అనే బ్రహ్మాండమైన సినిమా తీయొచ్చు: బుగ్గన

  • ఏపీ రాజధానిపై మాటలయుద్ధం
  • టీడీపీ నేతలపై మంత్రి బుగ్గన విమర్శలు
  • అమరావతిపై త్వరలోనే వాస్తవాలు వెల్లడిస్తామన్న బుగ్గన

ఏపీ రాజధాని అమరావతి విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిపై చంద్రబాబు చేసిన మోసాలతో 'శఠగోపం' అనే బ్రహ్మాండమైన సినిమా తీయొచ్చని ఎద్దేవా చేశారు. దళితులకు అన్యాయం చేసి చంద్రబాబు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు.

అసైన్డ్ భూములతో పాటు లంక భూములు కొనుగోలు చేసినవారిలో టీడీపీ నేతలే ఎక్కువమంది ఉన్నారని విమర్శించారు. పక్కా ప్లాన్ తో అమరావతిలో భూములు కొనుగోలు చేసి, ఆ తర్వాతే రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. త్వరలోనే అమరావతికి సంబంధించిన అన్ని వాస్తవాలు వెల్లడిస్తామని బుగ్గన చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ జరుగుతోందని అన్నారు.

Buggana
Chandrababu
Andhra Pradesh
Amaravathi
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News