KCR: కేసీఆర్ చెప్పారు... వికారాబాద్ ఎమ్మెల్యే పాటించారు!

  • నెలకోసారైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి
  • ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ సూచన
  • బస్సులో ప్రయాణించిన మెతుకు ఆనంద్

తెలంగాణలోని అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు నెలకు ఒక్కసారన్నా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ చేసిన సూచనలను వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పాటించారు. వికారాబాద్‌ నుంచి హైదరాబాద్ అసెంబ్లీ వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఆయన, బస్సులోని ఇతర ప్రయాణికులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికారాబాద్ డిపోలో బస్సుల సంఖ్య తక్కువగా ఉందని డిపో మేనేజర్ చెప్పారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. సీఎం ఆదేశాల మేరకే తాను బస్సు ప్రయాణం చేశానని చెప్పిన ఆనంద్,  ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు.

KCR
Vikarabad
TSRTC
BUS
Journey
  • Loading...

More Telugu News