Karnataka: అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం... కన్నడనాట మొదలైన ఉప ఎన్నికల పోలింగ్!

  • 15 నియోజకవర్గాలకు ఎన్నికలు
  • చలి తీవ్రతతో మందకొడిగా పోలింగ్
  • ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు

కర్ణాటకలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 15 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు వెల్లడించారు. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి 17 మంది ఎమ్మెల్యేలు కారణంకాగా, వారిపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్ లో ఉండగా, 15 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

ఈ ఉదయం చలి తీవ్రత అధికంగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించలేదు. బరిలోకి దిగిన ఎమ్మెల్యేల్లో పలువురు ఉదయాన్నే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుండగా, 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

  • Loading...

More Telugu News