Rajanikant: మొన్న కుమార్తెగా, నిన్న ప్రేయసిగా, నేడు ఎదిరించే విలన్ గా... రజనీకాంత్ పక్కన మరోసారి మీనా!

  • శివ దర్శకత్వంలో రజనీ చిత్రం
  • నిర్మించనున్న సన్ పిక్చర్స్
  • నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మీనా

గతంలో రజనీకాంత్ తో కలసి మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మీనా, ఇప్పుడు మరోసారి బంపరాఫర్ ను కొట్టేసింది. రజనీకాంత్ హీరోగా, సన్ పిక్చర్స్ సంస్థ శివ దర్శకత్వంలో చేయబోతున్న ఫ్యామిలీ డ్రామాలో మీనా విలన్ గా నటించనుందట. మీనా బాలనటిగా ఉన్న సమయంలో రజనీ హీరోగా నటించిన 'అన్బుళ్ల కేట్ట కురళ్' చిత్రంలో ఆయనకు కుమార్తెగా మీనా కనిపించింది. ఆపై 'ముత్తు', 'వీరా', 'యజమాన్' సినిమాల్లో ప్రేయసిగా జతకట్టింది. ఇక ఇప్పుడు రజనీకి విలన్ గా కనిపించనుందంటే విశేషమే కదా? ఇక ఈ కొత్త చిత్రంలో రజనీ సరసన కుష్బూ కనిపిస్తారట. 

Rajanikant
Meena
New Movie
  • Loading...

More Telugu News