Karnataka: జేడీఎస్ కు షాక్... దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు నమోదు!

  • కన్నడనాట నేడు ఉప ఎన్నికలు
  • తమ కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారని బీజేపీ ఫిర్యాదు
  • సూరజ్ రేవన్నపై హత్యాయత్నం కింద కేసు నమోదు

నలుగురు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై బుధవారం నాడు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో జేడీఎస్ కు షాక్ తగిలినట్లయింది. కన్నడనాట నేడు 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హసన్ జిల్లా చన్నరాయపట్న పోలీసు స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.

జేడీఎస్ ను వీడి బీజేపీలో చేరారన్న ఆగ్రహంతో తమ కార్యకర్తల ఇళ్లపై 200 మందితో కలసి వచ్చిన సూరజ్, దాడికి పాల్పడ్డారని, లక్షలాది రూపాయల ఆస్తులను ధ్వంసం చేశారన్నది బీజేపీ కార్యకర్తల ఆరోపణ. సమయానికి పోలీసులు రాకుంటే నష్టం మరింత అధికంగా ఉండేదని, గాయపడిన కార్యకర్తలకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని తెలిపారు. సూరజ్ సహా మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు కాగా, బీజేపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తోందని జేడీఎస్ మండిపడింది.

Karnataka
By-elections
Dewegouda
Suraj Ravanna
  • Loading...

More Telugu News