Sujana Chowdary: సుజనా చౌదరి భార్య పద్మజకు డీఆర్టీ నోటీసులు!

  • ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ. 169 కోట్ల రుణం
  • తిరిగి చెల్లించడంలో విఫలమైన సుజనా యూనివర్సల్
  • 16న విచారణకు రావాలని ఆదేశాలు

భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనా చౌదరి భార్య పద్మజకు డీఆర్టీ (డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ - రుణాల స్వాధీన ట్రైబ్యునల్) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. చెన్నైకి చెందిన ఐడీబీఐ బ్యాంకు శాఖ నుంచి రూ. 169 కోట్ల రుణాన్ని తీసుకున్న పద్మజ, దాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారన్నది ఆరోపణ.

 ఈ విషయంలో గతంలో పలుమార్లు నోటీసులు పంపినా ఆమె స్పందించలేదని బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. కాగా, పద్మజతో పాటు సుజనా యూనివర్సల్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ కు చెందిన శ్రీనివాసరాజు, ఎస్టీ ప్రసాద్‌, ఆయన భార్య ధనలక్ష్మి, సుజనా కేపిటల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, ఎక్స్‌ ప్లెయిర్‌ ఎలక్ర్టికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు కూడా హాజరు కావాలని డీఆర్టీ నోటీసులు ఇచ్చింది. 

Sujana Chowdary
Padmaja
IDBI
Loan
Notice
  • Loading...

More Telugu News