BJP: పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: జీవీఎల్ డిమాండ్

  • మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమనడం తగదు
  • ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది
  • భవిష్యత్ లో ఇటువంటి తప్పు చేయనని ప్రజలకు భరోసా ఇవ్వాలి

దేశంలో మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమని, ఏ గొడవలు జరిగినా దానికి హిందూ నాయకులే కారణమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యల వెనుక తప్పకుండా రాజకీయ దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. పవన్ తన తప్పుడు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, భవిష్యత్ లో ఇటువంటి తప్పు చేయనని ప్రజలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

BJP
Mp
GVL
Janasena
Pawan Kalyan
  • Loading...

More Telugu News