Rayalaseema: రేపు టమాటా మార్కెట్ కు వెళ్తా.. ఏ వైసీపీ ఎమ్మెల్యే ఆపుతారో చూస్తా: పవన్ కల్యాణ్

  • రేపు మదనపల్లెలో పర్యటించనున్న పవన్
  • షెడ్యూల్ ప్రకారం టమాటా రైతులతో పవన్ భేటీ కావాలి
  • మార్కెట్ యార్డు బిజీగా ఉందని, రావొద్దని చెప్పిన కార్యదర్శి 

రాయలసీమ పర్యటనలో భాగంగా జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు మదనపల్లెలో పర్యటించాలి. టమాటా మార్కెట్ యార్డులోని రైతులతో భేటీ అయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకున్నారు. అయితే, టమాటా సీజన్ మొదలైనందున మార్కెట్ యార్డు బిజీగా ఉందని, రావొద్దని కోరుతూ జనసేన పార్టీకి యార్డు కమిటీ కార్యదర్శి ఓ లేఖ రాశారు.

దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ, టమాటా రైతులతో మాట్లాడతానంటే తనకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. రేపు అనుమతి ఇవ్వకుంటే రోడ్డుపై కూర్చుని రైతులతో మాట్లాడతానని, రాయలసీమలో తన పర్యటనను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రేపు టమాటా మార్కెట్ కు వెళ్తా, ఏ వైసీపీ ఎమ్మెల్యే ఆపుతారో చూస్తానని సవాల్ చేశారు.

Rayalaseema
Madanapalle
Janasena
Pawan Kalyan
  • Loading...

More Telugu News