Hyderabad: దిశ ఘటన ఎఫెక్ట్.. హైదరాబాద్ ‘మెట్రో రైల్’లో పెప్పర్ స్ప్రేకు అనుమతి

  • మహిళల రక్షణ కోసం కీలక నిర్ణయం
  • ఇకపై ‘మెట్రో’లో ప్రయాణించే మహిళలు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు
  • ఈ మేరకు హైదరాబాద్ ‘మెట్రో’ ఎండీ ప్రకటన

దిశ ఘటన నేపథ్యంలో మహిళల రక్షణ కోసం హైదరాబాద్ ‘మెట్రో’ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మెట్రో’లో ప్రయాణించే మహిళలు ఇకపై తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఈ మేరకు ‘మెట్రో’ ఎండీ ఓ ప్రకటన చేశారు. మహిళల రక్షణ కోసం పెప్పర్ స్ప్రేలను కూడా స్టేషన్ లోకి అనుమతిస్తామని చెప్పారు. లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా వుండగా, దిశ ఘటన నేపథ్యంలో బెంగళూరు ‘మెట్రో’ అధికారులు ఈ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News