MIM: అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

  • బాబ్రీ మసీదు కూల్చేసిన వాళ్లందరినీ జైలుకు పంపాలి
  • కూల్చివేత ఘటనపై త్వరితగతిన విచారణ జరపాలి
  • మసీదుకు మరోచోట స్థలం ఇవ్వడం కరెక్టు కాదు

వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోమారు అదే బాట పట్టారు. బాబ్రీ మసీదును కూల్చేసిన వారందరినీ జైలుకు పంపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చివేత ఘటనపై త్వరితగతిన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మసీదుకు మరోచోట స్థలం ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. డిసెంబరు 6న బ్లాక్ డే సందర్భంగా శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలని కోరారు.

MIM
Akbaruddin Owaisi
Aayodhya
Babri mosque
  • Loading...

More Telugu News