sudan: సూడాన్ అగ్నిప్రమాద ఘటన.. మృతుల్లో 18 మంది భారతీయులు!
- ఖార్తూమ్ పారిశ్రామికవాడలో ఘటన
- మృతుల్లో 18 మంది భారతీయులు
- నలుగురి పరిస్థితి విషమం..ఏడుగురికి గాయాలు
సూడాన్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు భారతీయులు మృతి చెందారు. ఖార్తూమ్ పారిశ్రామికవాడలోని పింగాణి పరిశ్రమలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 18 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ రాయబార కార్యాలయం తెలిపింది. మరో ఏడుగురు భారతీయులకు గాయాలయ్యాయని, నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు పేర్కొంది. ఈ ప్రమాద ఘటనలో పూర్తిగా కాలిపోయినందున మృతదేహాలను గుర్తించడం కష్టసాధ్యంగా మారింది.